Shastipoorthy : చాన్నాళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, అర్చన. వీరితో పాటు రూపేష్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న చిత్రం షష్టి పూర్తి. మా అయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ నిర్మిస్తున్నాడు ఈ మూవీని. ఇప్పటికే సినిమాకు సంబంధించి బజ్ పెరిగింది. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఫీల్ గుడ్ కలిగేలా తీశాడు.
Shastipoorthy Movie Song Release
ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. మే 30న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మూవీ మేకర్స్. ఇప్పటి వరకు సినిమాకు చెందిన పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి ఆదరణ పొందాయి. ప్రధానంగా ఇళయరాజా అందించిన స్వరాలు హృదయాలను ఆకట్టుకునేలా చేశాయి. విచిత్రం ఏమిటంటే తొలిసారిగా ఆస్కార్ అవార్డు విన్నర్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇళయరాజా కోసం ఓ పాటను రాశారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది.
తాజాగా షష్టి పూర్తి(Shastipoorthy) మూవీకి సంబంధించి మూడో పాటను విడుదల చేశారు. మాటే నచ్చే మది మరుమైల్లె విచ్చే అంటూ సాగిన ఈ పాట గుండెలను మీటేలా ఉంది. హాయిగా విన సొంపుగా స్వరాలు కూర్చారు సంగీత జ్ఞాని. రాత్రంతా రచ్చే ..మరి నువ్వంటే పిచ్చే..అంటూ సాగింది ఈ సాంగ్. ఈ పాటకు ఓ విశేషం ఉంది. అదేమిటంటే ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా , నిత్యశ్రీ ఆలాపించారు. తను తొలిసారిగా పాట పాడడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాజా.
Also Read : Ananya Panday Interesting :కేసరి 2 మూవీ పాత్రను మరిచి పోలేను
