టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకడు గోపిచంద్ మలినేని. సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంలో తనకు తానే సాటి. ప్రత్యేకించి కథా పరంగా బలంగా ఉండేలా జాగ్రత్త పడతాడు. ఇక ఎవరి సహకారం లేకుండానే స్వయం కృషినే నమ్ముకుని మాస్ మహరాజాగా గుర్తింపు పొందాడు నటుడు రవితేజ. శ్రీలీలతో కలిసి నటించిన ధమాక చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తాజాగా కీలక ప్రకటన చేశాడు రవితేజ. తనతో బాగా వర్కవుట్ అయిన దర్శకులలో గోపీచంద్ మలినేని. తనతో కలిసి డాన్ శ్రీను, బలుపు , క్రాక్ సినిమాలు తీశాడు. ఈ మూడు తన కెరీర్ లో మరిచి పోలేని చిత్రాలంటూ స్పష్టం చేశాడు రవితేజ.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తాను గోపీచంద్ తో కొత్త సినిమా చేయబోతున్నట్లు స్పష్టం చేశాడు నటుడు. అధికారికంగా కూడా ప్రకటించాడు. నటుడు అంగీకరించాడు. ఇదే సమయంలో తను నటించిన టైగర్ నాగేశ్వర్ రావు కూడా ఆశించిన దానికంటే డివైడ్ టాక్ వచ్చింది.
మొత్తంగా మీద మలినేని, రవితేజ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రవితేజ మేనరిజాన్ని కొత్తగా ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు గోపీచంద్ మలినేని. కొత్త మూవీ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది.
