మాస్ మహరాజా, శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం మాస్ మహారాజా. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దాదాపు 90 శాతాం దాకా పూర్తయినట్లు సమాచారం. దీనిని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు దర్శకుడు భాను బోగవరపు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన భీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మాస్ మహారాజా మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. వచ్చే ఆగస్టు 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు నిర్మాత నాగవంశీ.
తను తీసిన మ్యాడ్ సీక్వెల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. ఇక రవితేజ విషయానికి వస్తే తను ఈ మూవీ తర్వాత తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. వాస్తవానికి మే నెలలోనే మాస్ జాతరను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాక పోవడంతో దానిని ఆగస్టుకు జరిపారు.
దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి నటించనున్నాడు రవితేజ. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, వారిలో ఇప్పటికే ఇద్దరిని సెలెక్టు కూడా చేశారని టాక్. ఒకరు కేతికా శర్మ కాగా మరొకరు నా సామి రంగా మూవీ ఫేమ్ ఆషికా రంగనాథ్ అని. ఈ మూవీకి సంబంధించి ఈనెల 16 నుంచి రెగ్యులర్ గా చిత్రీకరణ ఉంటుందని సమాచారం. జూలై 24 దాకా కంటిన్యూగా 40 రోజుల పాటు చిత్రీకరిస్తారు. ఇది రవితేజ కెరీర్ లోనే రికార్డ్ అని చెప్పక తప్పదు.