బెంగళూరు – ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా 33 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేవలం 35 వేల మంది మాత్రమే కూర్చునే వీలున్న చిన్న స్వామి స్టేడియంలో. కానీ నిర్వాహకులు , కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇవేమీ పట్టించుకోలేదు. చివరకు ఆర్సీబీ హెడ్ నిఖిల్ సోసలే నిర్వాకం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరో వైపు రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది సర్కార్ పై. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యేమేనంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే మంగళ వారం లోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ సమయంలో దిద్దుబాటు చర్యలకు దిగారు సీఎం సిద్దరామయ్యా. వెంటనే ఇందుకు బాధ్యత వహిస్తూ నగర పోలీస్ కమిషనర్ దయానంద్ తో పాటు డీఎస్పీపై వేటు వేశారు.
అంతే కాకుండా రిటైర్డ్ జడ్జితో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకుంది. దీంతో సంబురాలు మిన్నంటేలా చేయాలని అనుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్సీబీ జట్టుకు షాక్ ఇచ్చారు పోలీసులు. కేసు నమోదు చేశారు. 3 లక్షల మంది పోగయ్యారు. ఊపిరి ఆడక చని పోయారు.