బెంగళూరు – ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరు వేదికగా జరిగిన తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం నాటికి తుది నివేదిక ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది సర్కార్.
ఆర్సీబీతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదు చేయాలిన ఆదేశించారు సీఎం సిద్దరామయ్య. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కాపాడటంలో ఫెయిల్ అయినందుకు సిటీ నగర పోలీస్ కమిషనర్ దయానంద్ తో పాటు డీఎస్పీపై వేటు వేసింది. అంతే కాకుండా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్సీబీతో పాటు కేసీఏ ప్రతినిధులపై కేసులు నమోదు చేశారు.
ప్రధానంగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ముంబైకి చెక్కేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు తను. ఆయన తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరు ఘటనతో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు దాఖలు చేసిన దావాలో. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. దీంతో ఆర్సీబీ వర్సెస్ సర్కార్ గా మారి పోయింది ఈ ఘటన.
