ప్రముఖ మలయాళ సినీ, టీవీ సీరియల్ నటి రెంజూషా మీనన్ అనుమానాస్పద మృతి చెందింది. తను అద్దెకు ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. రెంజూషా మీనన్ వయసు 35 ఏళ్లు. తన ఫ్యామిలీతో కలిసి ఉంటోంది. ఇదిలా ఉండగా విషయం తెలిసిన వెంటనే పోలీసులు నటి మృతిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ఇవాళ రెంజూషా మోహన్ ఉంటున్న గదికి తాళం వేసి ఉండడాన్ని గమనించారు కుటుంబీకులు. అనుమానం వచ్చి తాళం ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు. చూస్తే నటి ఉరి వేసుకుని ఉండడంతో షాక్ కు గురయ్యారు. ఆమె మృతి చెందిన విషయంపై పోలీసులు స్పందించారు.
పోస్టు మార్టం నిమిత్తం తరలించామని, విచారణ ప్రారంభించామని, దీనికి గల కారణాలు ఏమై ఉంటాయనే దానిపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రెంజూషా మీనన్ పలు సినిమాలలో నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా సీరియల్స్ లో కూడా మెరిసింది.
రెంజూషా మీనన్ మృతిపై మలయాళ సినీ రంగానికి చెందిన నటీ, నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు.