తాజాగా టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో నటించింది రేణు దేశాయ్. చాలా కాలం తర్వాత ఆమె మూవీలో కనిపించడం. ఇందులో మాస్ మహరాజా రవితేజ, నుపుర్ సనన్ నటించారు. ఇది ఓ పేరు మోసిన గజ దొంగ జీవిత కథగా తెరకెక్కించాడు దర్శకుడు.
ఇది పక్కన పెడితే రేణు దేశాయ్ నిజాలను చెప్పేందుకు భయపడదు. తన మనసులో మాటల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతుంటారు. ఒక రకంగా ఆమె సోషల్ మీడియాలో ట్రోల్ కు గురైనా డోంట్ కేర్ అంటోంది. ఆమె పవన్ కళ్యాణ్ గురించి వాస్తవాలు చెప్పేందుకు రెడీ అంటోంది.
ఇందుకు సంబంధించి లై డిటెక్టర్ టెస్ట్ చేయించు కునేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు.
తాను పవన్ కళ్యాణ్ ను సామాన్యుడి లాగానే చూడాలని ఉందన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాని గురించి తాను ఆలోచించనని చెప్పింది. దేవుడు అనే వాడు ఉన్నాడు. అంతా ఆయనే చూసుకుంటాడని తెలిపింది. పొలిటికల్ ఫ్యూచర్ ఆయన చేతుల్లోనే ఉందన్నారు రేణు దేశాయ్.