Hero Suriya-Retro Movie :రెట్రో ఫుల్ ప్యాక్డ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

సూర్య‌..పూజా హెగ్డే కీల‌క పాత్ర‌ల్లో

Retro : త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన మూవీ రెట్రో. విల‌క్ష‌ణ న‌టుడు సూర్య‌, అందాల బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దీనిని పూర్తిగా యాక్ష‌న్, క్రైమ్, థ్రిల్ల‌ర్ గా రూపొందించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. జోజు జార్జ్ కూడా కీ రోల్ పోషించ‌డం విశేషం. జ్యోతిక‌, సూర్య రెట్రోను నిర్మించారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించ‌గా శ్రేయ‌స్ కృష్ణ సినిమాటోగ్ర‌ఫీ నిర్వ‌హించారు. రెట్రో నుంచి రిలీజ్ అయిన టీజ‌ర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Retro Movie Updates

ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ ఏమిటంటే మ‌హ‌మ్మ‌ద్ షఫీక్ అలీ ఎడిటింగ్ వీర లెవ‌ల్లో ఉంది. రెట్రో(Retro) మూవీని మే1న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్ప‌టికే న‌టీ న‌టులు సూర్య‌, పూజా హెగ్డే, ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ప్ర‌చారంలో ఫుల్ బిజీగా మారారు. ఎక్క‌డికి వెళ్లినా వారికి జ‌నం బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. ఇక త‌న సినిమాల‌లో మ‌హిళా పాత్ర‌ల‌కు ప్ర‌యారిటీ ఎక్కువ‌గా ఇస్తాడు ద‌ర్శ‌కుడు.

ప్ర‌త్యేకించి సాంప్ర‌దాయానికి పెద్ద‌పీట వేస్తాడు. భావోద్వేగాల‌ను తెరపై ప్ర‌తిఫ‌లించేలా చేయ‌డంలో త‌న‌కు త‌నే సాటి. ఈసారి పూజా హెగ్డేను కొత్తగా చూపిస్తున్న‌ట్లు టాక్. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్ కూడా మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఇప్ప‌టికే త‌మిళం, తెలుగు, హిందీల‌లో త‌ళుక్కున మెరిసింది పూజా హెగ్డే. త‌ను రెట్రో మూవీపై భారీ న‌మ్మ‌కం పెట్టుకుంది.

Also Read : Beauty Janhvi Kapoor : పీరియ‌డ్స్ బాధాక‌రం త‌ట్టుకోవ‌డం క‌ష్టం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com