Ridhi Dongra : ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్

డైరెక్ట‌ర్ అట్లీకి రుణ‌ప‌డి ఉన్నా

బాలీవుడ్ న‌టి రిధి డోంగ్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. జ‌వాన్ మూవీలో పెంపుడు త‌ల్లిగా న‌టించింది రిధి డోంగ్రా. ఈ సంద‌ర్బంగా త‌న‌ను ఎంచు కోవ‌డం, ఛాన్స్ ఇవ్వ‌డం ప‌ట్ల జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేసింది.

అట్లీ డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాదు అద్భుత‌మైన హ్యూమ‌న్ బీయింగ్ అంటూ కితాబు ఇచ్చింది. షారుక్ ఖాన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కానీ చిత్రానికి సంబంధించిన సిస‌లైన హీరో ద‌ర్శ‌కుడే. క్రియేటివిటీకి పెట్టింది పేరు. మ‌రోసారి ఛాన్స్ ఇవ్వాల‌ని త‌న‌ను కోరుకుంటున్నాన‌ని చెప్పింది రిధి డోంగ్రా.

శుక్ర‌వారం బాలీవుడ్ న‌టి మీడియాతో చిట్ చాట్ చేసింది. జ‌వాన్ సినిమాను ఓ య‌జ్ఞంలా చేశామ‌ని తెలిపింది. కార‌ణం ద‌ర్శ‌కుడి టాలెంట్ త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌ని పేర్కొంది. ప్ర‌తి షాట్ అద్భుతంగా వ‌చ్చేలా చేయ‌డంలో వంద శాతం కృషి చేశాడంటూ కితాబు ఇచ్చింది రిధి డోంగ్రా.

విచ‌త్రం ఏమిటంటే జ‌వాన్ లో బాలీవుడ్ బాద్ షాకు త‌ల్లిగా న‌టించ‌డం అనేది ఎవ‌రూ ఊహించ‌ర‌ని, కానీ త‌న‌ను ఏరికోరి ఎంపిక చేయ‌డ‌మే కాకుండా త‌న‌కు గొప్ప పాత్ర‌ను ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలిపింది ఈ ముద్దుగుమ్మ‌.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com