Robinhood : వెంకీ కుడుముల దర్శకత్వంలో స్టార్ హీరో నితిన్ రెడ్డి, లవ్లీ బ్యూటీ శ్రీలీల కలిసి నటించిన చిత్రం రాబిన్ హుడ్(Robinhood). ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అతిథి పాత్రలో స్టార్ వరల్డ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తుండడం విశేషం. ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు. గతంలో తను తీసిన సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఈసారి కూడా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు కుడుముల.
Robinhood Movie Trailer Sensation
హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో రాబిన్ హుడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా టాప్ లో ఉన్నారు నిర్మాతలు. ఇప్పటికే వీరు నిర్మించిన చిత్రం పుష్ప2 దేశంలోనే అత్యధిక వసూలు చేసిన రెండో చిత్రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక రాబిన్ హుడ్ సినిమాకు వస్తే ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కెవ్వు కేక అనేలా ఉన్నాయి.
ఈ సినిమాకు తమిళ సినీ రంగంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఇక లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇందులో నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Yash- Toxic Movie : యష్ టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్