Vaibhav Suryavanshi Sensational :మామూలోడు కాదు రియ‌ల్ టార్చ్ బేర‌ర్

వైభ‌వ్ సూర్య‌వంశీ సెన్సేష‌న్ సెంచ‌రీ

Vaibhav Suryavanshi Sensational

Vaibhav Suryavanshi : అత‌డు మూవీని మ‌రోసారి గుర్తుకు తెచ్చేలా చేశాడు. వీడు మగాడ్రా బుజ్జీ అనుకునేలా ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు. ప‌ట్టుమ‌ని త‌న‌కు 14 ఏళ్లు. కానీ వ‌ర‌ల్డ్ టాప్ క్లాస్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. ఎలాంటి భ‌యం లేకుండా ధైర్యంగా మిస్సైల్ లాంటి బంతుల‌ను గ్రౌండ్ దాటించాడు. మైదానం న‌లువైపులా క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. అల‌వోక‌గా ఫోర్లు, సిక్స్ లు కొడుతుంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ చేష్ట‌లుడిగి చూస్తుండి పోయింది. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ హిస్ట‌రీలో త‌క్కువ బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను ఆడిన మూడు మ్యాచ్ లో 151 ర‌న్స్ చేశాడు. త‌ను కేవ‌లం 38 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 101 ర‌న్స్ చేశాడు.

Vaibhav Suryavanshi Sensational Record

కేవ‌లం 35 బంతుల్లో సెంచ‌రీ బాదాడు. ఇందులో 94 ప‌రుగులు కేవ‌లం ఫోర్లు, సిక్స‌ర్ల‌తో వ‌చ్చాయి. 7 ఫోర్లు 11 సిక్స‌ర్ల మోత మోగించాడు. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ‌రిలోకి దిగింది గుజ‌రాత్ టైటాన్స్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 209 ర‌న్స్ చేసింది. కెప్టెన్ గిల్ 50 బంతుల్లో 84 ర‌న్స్ చేస్తే బ‌ట్ల‌ర్ 26 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం 210 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) తుక్కు రేపింది. కేవ‌లం 15.5 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి కానిచ్చేసింది. సూర్య వంశీ(Vaibhav Suryavanshi) 101 చేస్తే , య‌శ‌స్వి జైశ్వాల్ 70 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

త‌న‌ను గ‌త నెల‌లో సూర్య‌వంశీని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఐపీఎల్ వేలం పాట‌లో ఏకంగా రూ. 1, 03,789 ల‌కు తీసుకున్నాడు. ఈ 18వ సీజ‌న్ లో పాల్గొన్న అతి పిన్న వ‌య‌సు క‌లిగిన ఆట‌గాడిగా రికార్డ్ బ్రేక్ చేశాడు. త‌న తొలి మ్యాచ్ లోనే మొద‌టి బంతిని సిక్స్ కొట్ట‌డం ద్వారా త‌న స‌త్తా ఏమిటో చూపించాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను గ‌తంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19లతో జరిగిన యూత్ టెస్ట్‌లో భారత అండర్-19ల తరపున 58 బంతుల్లో సెంచరీ సాధించి వార్తల్లో నిలిచాడు.
గత సంవత్సరం భారత అండర్-19 ఆసియా కప్ జట్టులో సూర్యవంశీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. అక్కడ అతను 44 సగటుతో 176 పరుగులు చేశాడు. బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. గత జనవరిలో 12 సంవత్సరాల వయసులో అరంగేట్రం చేశాడు. ఐదు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు . రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడ‌తాడో వేచి చూడాలి.

Also Read : Beauty Deepika Padukone-Atlee :అట్లీ మూవీలో దీపికా..జాన్వీ క‌పూర్..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com