కొన్ని సినిమాలు ఆసక్తిని కలిగిస్తాయి. మరికొన్ని విడుదల కాకుండానే ఆలోచింప చేస్తాయి. ప్రస్తుతం తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. బలమైన కంటెంట్ ఉన్న వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు నిర్మాతలు. దానిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.
తాజాగా అలాంటి కోవలోకి వచ్చేదే సగిలేటి కథ. సినిమా పేరు కూడా భిన్నంగా ఉంది. ఇది పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , టీజర్ మరింత ఆసక్తిని కలిగించేలా చేసింది.
రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు సగిలేటి కథ చిత్రాన్ని. ఇందులో రవితేజ మహా దాస్యం, విశిక కోట ప్రధాన పాత్రల్లో నటించారు. అశోక్ ఆర్ట్స్ , షేడ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో నవదీప్ దీనిని అందించారు. ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది.
ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోని ఓ పల్లెటూరులో పాత్రల మధ్య జరిగే నాటకీయ సంఘటనలను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సంగిలేటి కథలో. ప్రతి పాత్ర ఆకట్టుకునేలా, మనకు దగ్గరగా ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
