Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ‘జ్యువెల్‌ థీఫ్‌’ షూటింగ్ పూర్తి !

సైఫ్ అలీఖాన్ ‘జ్యువెల్‌ థీఫ్‌’ షూటింగ్ పూర్తి !

Hello Telugu - Saif Ali Khan

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో రాబీ గ్రేవాల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘జ్యువెల్‌ థీఫ్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమాలో నికిత దత్తా, జైదీప్‌ అహ్లావత్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పై… గత కొన్ని రోజులుగా ఎటువంటి అప్ డేట్ రాలేదు. కాని ఈ సినిమా షూటింగ్ గోప్యంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పై సీనియర్ నటుడు కునాల్ కపూర్ మంగళవారం తన సోషల్ మీడియా ద్వారా ఓ కీలక విషయాన్ని ప్రకటించారు.

Saif Ali Khan..

గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్, అప్‌డేట్స్‌ విషయంలో చాలా గోప్యతను పాటించిన చిత్రబృందం కొద్దిరోజుల కిందటే దర్శకనిర్మాత సిద్ధార్థ్‌ ఆనంద్, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. తాజాగా ‘చిత్రబృందంలో నేనే సీనియర్‌ నటుడిని. షూటింగ్‌ ముగిసినట్టు ప్రకటించే హక్కు నాకుంది’ అంటూ చిత్రీకరణ ముగిసినట్టు కునాల్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

Also Read : Pawan Kalyan Mother: ‘గాజు గ్లాసు’లోనే టీ తాగుతా అంటున్న పవన్‌ కళ్యాణ్‌ తల్లి అంజనాదేవి !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com