Salaar Sucess Party: బెంగుళూరులో ‘సలార్‌’ సక్సెస్‌ పార్టీ ! వైరల్ అవుతోన్న వీడియోలు

బెంగుళూరులో ‘సలార్‌’ సక్సెస్‌ పార్టీ ! వైరల్ అవుతోన్న వీడియోలు

Hello Telugu - Salaar Sucess Party

Salaar Sucess Party: ‘కేజిఎఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘సలార్’. డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా… సుమారు రూ. 700 కోట్లు వసూలు చేసి వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. దీనితో ‘సలార్‌’ విజయాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారంట్‌లో సక్సెస్‌ పార్టీ నిర్వహించింది. ఈ సక్సెస్‌ పార్టీలో ప్రభాస్‌, శ్రుతిహాసన్‌, ఈశ్వరీరావు, జగపతిబాబు, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ సహా సినిమా యూనిట్ సభ్యులు పాల్గొని సందడి చేశారు. ‘హలో మేడమ్‌.. మమ్మీ.. బ్యూటిఫుల్‌ మమ్మీ’ అంటూ ఈశ్వరీరావును ప్రభాస్‌ ఆత్మీయంగా పలకరించారు. ఈ పార్టీకి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Salaar Sucess Party Viral

బాహుబలి-2 తరువాత ప్రభాస్ కు చెప్పుకోదగ్గ హిట్ లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అయినప్పటికీ కేజీఎఫ్ సీరిస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రభాస్ వస్తుండటంతో ‘సలార్(Salaar)’ పై భారీగా అంచనాలు ఉండేవి. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 22న ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుని ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విజయాన్ని అందుకుంది.

చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను పవర్‌ఫుల్‌ రోల్‌ లో అభిమానులకు చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కథ, కీలక పాత్రధారుల నటన, హీరో ఎలివేషన్స్‌ ఈ సినిమాకు ప్లస్‌ గా మారాయి. ఖాన్సార్‌ అందులోని పాత్రలను ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’తో పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్… రాజమన్నార్‌ తర్వాత ఖాన్సార్‌ సామ్రాజ్య సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించనున్నారనే ఆసక్తికర అంశంతో ‘సలార్‌ పార్ట్ 2’ను సిద్ధం చేయనున్నారు.

Also Read : Guntur Kaaram Collections : మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ అంటున్న నెటిజన్లు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com