Beauty Samantha :ఆ సాంగ్ అంత హిట్ అవుతుంద‌ని అనుకోలేదు

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన స‌మంత రుత్ ప్ర‌భు

Samantha : నేష‌న‌ల్ బ్యూటీ క్వీన్ గా పేరొందిన న‌టి స‌మంత రుత్ ప్ర‌భు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌ను ఇటీవ‌లే నిర్మాత‌గా కూడా మారింది. శుభం సినిమా తీసింది. ఇది విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ చేసిన స‌మంత(Samantha) త‌న కెరీర్ గురించి అభిప్రాయాలు పంచుకుంది. విచిత్రం ఏమిటంటే తాను స్పెష‌ల్ సాంగ్ లో న‌టిస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని చెప్పింది. ఓ వైపు సినిమాలు ఇంకో వైపు వెబ్ సీరీస్ తో చాలా బిజీగా ఉన్నా.

Samantha Ruth Prabhu Viral Comments

ఈ స‌మ‌యంలో త‌న‌ను ద‌ర్శ‌కుడు సుకుమార్ సంప్ర‌దించారు. అంత‌కు ముందు తాను గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి రంగ‌స్థ‌లంలో న‌టించా. అది ఊహించ‌ని రీతిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్రేక్ష‌కులు మ‌రోసారి త‌న‌ను త‌మ దానిగా భావించారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు డైరెక్ట‌ర్. అదేమిటంటే న‌టిగా కాదు కేవ‌లం ఓ స్పెష‌ల్ సాంగ్ మాత్ర‌మే చేయాల‌ని చెప్పారు. ముందు నేను ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత త‌నే ఒప్పించాడు. కార‌ణం సుకుమార్ పై త‌న‌కు ఉన్న న‌మ్మ‌కం అలాంటిద‌ని చెప్పింది స‌మంత రుత్ ప్ర‌భు.

పుష్ప -1 మూవీలో చంద్ర‌బోస్ రాయ‌గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఊ అంటావా ఊఊ అంటావా మావా అనే సాంగ్. దీనిని ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ సోద‌రిణి చంద్ర‌వ‌తి రాథోడ్ పాడింది. ఆమె గొంతులోని హ‌స్కీ వాయిస్ ప్రేక్ష‌కుల‌ను ఊపేసేలా చేసింది. అంతే కాదు బాంబే కొరియో గ్రాఫ‌ర్ చేసిన ఈ డ్యాన్స్ మూవెంట్స్ కు జ‌నం పిచ్చెక్కి పోయారు. ప్ర‌త్యేకించి బ‌న్నీతో పోటీ ప‌డి న‌టించింది స‌మంత రుత్ ప్ర‌భు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా రికార్డ్ బ్రేక్ చేసింది.

Also Read : Shehbaz Shariff Shocking :భార‌త్ కాళ్ల బేరానికి వ‌చ్చింది – పీఎం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com