అక్కినేని నాగ చైతన్యతో విడాకులు పొందాక అటు సమంత రుత్ ప్రభుకు ఇటు చైతుకు ఈ ఏడాది శుభారంభం లభించిందని చెప్పక తప్పదు. నాగ్ తనతో విడి పోయాక మరో నటి శోభిత ధూళిపాళను చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ ఆమె వచ్చిన వేళా విశేషం సాయి పల్లవితో కలిసి తండేల్ చిత్రంలో నటించాడు. ఇది సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా రూ. 100 కోట్లు సాధించింది. తనకు బూస్ట్ తీసుకు వచ్చేలా చేసింది.
ఇదే సమయంలో నటిగా, వెబ్ సీరీస్ లలో నటిస్తూ బిజీగా మారి పోయింది నటి సమంత రుత్ ప్రభు. తను ప్రస్తుతం వెబ్ సీరీస్ డైరెక్టర్ గా పేరు పొందిన రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో తను దానిని ఖండించలేదు. అయితే రాజ్ భార్య మాత్రం కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకునేలా చేసింది.
తాజాగా తను నిర్మాతగా మారింది. అందరినీ విస్మయానికి గురి చేసింది. తను నిర్మించిన చిత్రం శుభం. ఇది పూర్తిగా కామెడీ, సస్పెన్స్ , థ్రిల్లర్ తో తెరకెక్కించాడు దర్శకుడు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీని ప్రేక్షకులు సూపర్ గా ఆదరించారు. మొత్తంగా సమంత తన కెరీర్ లో తీసుకున్న ఈ నిర్ణయం తనకు మేలు చేకూర్చేలా చేసింది.
