Samantha Shocking : డేటింగ్ చేసేంత స‌మ‌యం లేదు

షాకింగ్ కామెంట్స్ చేసిన స‌మంత

Samantha : పాన్ ఇండియా హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌ను సినిమాల‌తో పాటు వెబ్ సీరీస్ ల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇటీవ‌లే అక్కినేని నాగ చైత‌న్యతో విడాకులు తీసుకుంది. ఇదే స‌మ‌యంలో త‌ను ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించే తండ్రిని కోల్పోయింది. త‌నకు కొంత ఏకాంతం కావాల‌ని ఆ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా చెప్పింది. ఖుషి మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో త‌ళుక్కున మెరిసింది. ఆ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. త‌న పాత్రలో లీన‌మై న‌టించింది స‌మంత‌(Samantha).

Samantha Shocking Reation..

పాన్ ఇండియా మూవీగా సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప మూవీలో ఊ అంటావా అనే స్పెష‌ల్ సాంగ్ తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది న‌టి స‌మంత రుత్ ప్ర‌భు. ప్ర‌స్తుతం ఓ వెబ్ సీరీస్ పై ఫోక‌స్ పెట్టింది. కాగా ఆమ‌ధ్య‌న త‌ను ఓ వెబ్ సీరీస్ ద‌ర్శ‌కుడితో డేటింగ్ లో ఉన్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

దీనిపై స్పందించింది స‌మంత రుత్ ప్ర‌భు. జీవితం చాలా చిన్న‌ది. నాకు ప్రేమ‌లో ప‌డేంత స‌మ‌యం లేదు. ఇప్ప‌టికే చాలా విసుగు వ‌చ్చిందంటూ వాపోయింది. ఇవ‌న్నీ లేనిపోని ప్ర‌చారం త‌ప్పా మ‌రోటి కాద‌ని పేర్కొంది. తాను పూర్తిగా మూవీస్ , వెబ్ సీరీస్ పై ఫోక‌స్ పెడుతున్న‌ట్లు తెలిపింది.

Also Read : Beauty Keerthy vs Radhika :కీర్తి సురేష్‌..రాధికా ఆప్టే నువ్వా నేనా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com