దుబాయ్ లో స‌మంత రుత్ ప్ర‌భు హ‌ల్ చ‌ల్

ఓ బంగారు న‌గ‌ల షాప్ కోసం ఫోటో షూట్

అక్కినేని నాగార్జున కుటుంబంతో విడి పోయాక , నాగ చైత‌న్య‌తో విడాకులు పొందాక స్టార్ హీరోయిన స‌మంత రుత్ ప్ర‌భు మ‌రింత సంచ‌ల‌నంగా మారారు. త‌ను ఓ వైపు సినిమాలు ఇంకో వైపు వెబ్ సీరీస్ తో బిజీగా ఉన్నారు. అంతే కాదు ఈవెంట్స్ కు హాజ‌ర‌వుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఇత‌ర హీరోయిన్ల కంటే త‌ను యాక్టివ్ గా ఉంటారు. ఇది త‌న స్పెషాలిటీ. ఆ మ‌ధ్య‌న త‌న ఆరోగ్యానికి సంబంధించి త‌నే బ‌య‌ట పెట్టుకుంది. త‌ను మాన‌సికంగా చాలా ధృఢంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది. అంతే కాదు ఉన్న‌ట్టుండి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తూ ప్ర‌ముఖ వెబ్ సీరీస్ ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమోరుతో క‌లిసి చెట్టా ప‌ట్టాల్ వేసుకుని తిరిగింది.

అంతే కాదు ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌ను సంద‌ర్శించింది. ఇద్ద‌రికి సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ల చేశాయి. దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు ఈ ఇద్ద‌రు. ఈ మ‌ధ్య‌న సినీ ఇండ‌స్ట్రీలో ఏ క‌పుల్స్ స‌రిగా ఉండ‌డం లేదు. అప్పుడే పెళ్లి ఆ త‌ర్వాత పెటాకులు. కోలీవుడ్ లో ఇప్పుడు మ‌రో క‌పుల్ విడాకుల దాకా వెళ్లారు. వారు జ‌యం ర‌వి, ఆర్తి ప్ర‌కాశ్. న‌టుడు ప్ర‌ముఖ సింగ‌ర్ తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇద్ద‌రికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు తెగ వైర‌ల్ అయ్యాయి. త‌మ‌కు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు.

ఇక స‌మంత‌తో విడి పోయాక నాగ చైత‌న్య శోభిత ధూళిపాళ‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇదే స‌మ‌యంలో సో ద‌రుడు అఖిల్ అక్కినేని జైనాబ్ మెడ‌లో తాజాగా తాళి క‌ట్టాడు. ఈ వివాహానికి ఆహ్వానం అంద‌లేదు స‌మంత‌కు. ఈ స‌మ‌యంలో త‌ను దుబాయిలో బిజీగా ఉంది. ఓ జ్యూవెల‌రీ షాపు కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. ఇవి ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి. స‌మంతా మ‌జాకా అంటున్నారు ఫ్యాన్స్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com