Samantha : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను నటిగా ఇటు సినిమాలలో అటు వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా మారింది. ఇదే సమయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. తను నిర్మాతగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించింది. దీని ద్వారా శుభం సినిమాను నిర్మించింది. దీనిని సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించాడు.
Samantha Challenges
శుభంకు సంబంధించి టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసింది సమంత. మూవీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ప్రకటించింది సమంత రుత్ ప్రభు(Samantha). ఇక శుభంలో హర్షిత్ రెడ్డి, చరణ్ పేరి , శ్రియకొంతం, శ్రావణి లక్ష్మి, గవిరెడ్డి శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా చిట్ చాట్ చేసింది నటి. చాలా మంది రిస్క్ తీసుకోవాలంటే జంకుతారని, ఇంకొందరు భయపడతారని, లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారని కానీ తనకు అలాంటివి ఇష్టం ఉండదన్నారు.
తనకు సవాళ్లను స్వీకరించడం, రిస్క్ తీసుకోవడం అంటే చాలా ఇష్టమని చెప్పింది సమంత రుత్ ప్రభు.
లేకపోతే సక్సెస్ రాదని, వచ్చినా తనకు కిక్ ఇవ్వదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినీ రంగంలోకి వచ్చి 15 ఏళ్లవుతోంది. చాలా అనుభవం వచ్చింది. ఇదే సమయంలో ఎన్నో కథలను విన్నాను. ప్రతి కథకు ఓ ముగింపు ఉంటుంది. వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా..మంచి కథలతో సినిమాలు తీయాలన్నది నా లక్ష్యమని స్పష్టం చేసింది సమంత రుత్ ప్రభు.
Also Read : Retro Movie Success :కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ రెట్రో బిగ్ సక్సెస్