Samyuktha : అందరూ నందమూరి బాలకృష్ణ గురించి ఏదేదో చెప్పారని కానీ ఆయన విషయంలో అలాంటిది ఏమీ లేదని అంటోంది మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్. తనకు కూడా నందమూరి గురించి అలాగే చెప్పారంటూ తెలిపింది. ఈ మధ్య చిట్ చాట్ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తనతో సినిమా అనగానే తాను చాలా భయపడ్డానని, కానీ షూటింగ్ లో జాయిన్ అయ్యాక అది పూర్తిగా తప్పని తేలి పోయిందన్నారు.
Samyuktha Menon Praises Nandamuri Balakrishna
విచిత్రం ఏమిటంటే ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో తను వంద శాతం లీనమై పోతారని చెప్పింది నందమూరి బాలకృష్ణ. చేస్తున్న క్యారెక్టర్ ను బట్టి తను మారి పోతాడు. ఒక రకంగా తనతో నటించడం తాను అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. ఎవరూ ఊహించని రీతిలో బాలయ్యను ప్రశంసలతో ముంచెత్తింది. ఓహ్ ఇలాంటి హీరో గురించా ఇలా మాట్లాడేది అంటూ పేర్కొంది. మేకప్ వేసుకోక ముందు చాలా జోవియల్ గా ఉంటారు. అందరితో కలిసి పోతారు. ఒక రకంగా బాలయ్య బాబు చిన్నపిల్లాడి మనస్తత్వం అంటూ తెలిపింది సంయుక్తా మీనన్(Samyuktha).
ఇలాంటి యాక్టర్ ను ఇంత వరకు తాను చూడలేదని చెప్పింది. తను నందమూరి బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ మూవీ అఖండ తాండవంలో కీలక పాత్రలో నటిస్తోంది. బాలయ్య గురించి తొలుత భయపడ్డా. తన సినీ కెరీర్ పరంగా చూస్తే అందులో పావు వంతు కూడా ఉండదని పేర్కొంది. తను తొలుత షూటింగ్ కు వెళ్లగానే భుజం తట్టారు. నీకు మంచి భవిష్యత్తు ఉందంటూ అనడంతోనే తాను కలల్లో తేలి పోయానని కితాబు ఇచ్చింది.
Also Read : Hero Vijay-Jana Nayagan :జన నాయగన్ ఓటీటీ రైట్స్ రూ. 121 కోట్లు
