Hero Ranbir Kapoor :రణ‌బీర్ కు కిక్ ఇచ్చిన యానిమ‌ల్

ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి 

Hero Ranbir Kapoor

Ranbir Kapoor : పాన్ ఇండియా డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను హిందీలో తీసిన యానిమ‌ల్ మూవీపై స్పందించాడు. ఈ మూవీ గురించి చాలా మంది చాలా ర‌కాలుగా కామెంట్స్ చేశార‌ని, ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొంద‌న్నాడు. కానీ ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ అయ్యింది. అంతే కాదు భారీ ఎత్తున వ‌సూళ్లు చేసింద‌న్నాడు. అయితే సినిమా ఎంత‌గా విమ‌ర్శ‌ల‌కు లోనైంతో అంత‌గా స‌క్సెస్ కావ‌డ‌మే కాదు న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్(Ranbir Kapoor) కు ఊహించ‌ని స్టార్ డ‌మ్ వ‌చ్చేలా చేసింద‌ని చెప్పాడు.

Ranbir Kapoor Comment about Animal Movie

చిట్ చాట్ సంద‌ర్బంగా వంగా సందీప్ రెడ్డి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. తాను ఎవ‌రి గురించి ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న దృష్టి ప్ర‌స్తుతం చేయ‌బోయే సినిమాపైనే ఉంటుంద‌న్నాడు. త‌న‌కు లైఫ్ , ఫ్యామిలీ, సినిమా, పాట‌లు ముఖ్య‌మ‌న్నాడు. ఐ డోంట్ కేర్ అద‌ర్స్  అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

యానిమ‌ల్ బిగ్ స‌క్సెస్ కావ‌డంతో యానిమ‌ల్ పార్క్ పేరుతో సీక్వెల్ తీసే ప‌నిలో ప‌డ్డాడు వంగా సందీప్ రెడ్డి. 2023లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్ తో పాటు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న క‌లిసి న‌టించ‌గా విల‌న్ గా బాబీ డియోల్ కీ రోల్ పోషించాడు. తాజాగా వంగా సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి బాలీవుడ్ లో.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com