Sarangapani Jathakam Success :దూసుకు పోతున్న సారంగ‌పాణి జాత‌కం 

మెల మెల్ల‌గా థియేట‌ర్ల వ‌ద్ద‌కు ప్రేక్ష‌కులు 

Sarangapani Jathakam Success

Sarangapani Jathakam : కంటెంట్ బాగుంటే సినిమాను ఆద‌రిస్తార‌ని తేలి పోయింది ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ తీసిన సారంగ‌పాణి జాత‌కం. ఇది పూర్తిగా ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలిచింది. విడుద‌లైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. విమ‌ర్శ‌కులను సైతం మెప్పించేలా చేసింది. ఇందులో ప్రియ‌ద‌ర్శి పులికొండ‌, రూపా కొడియార్ , వెన్నెల కిషోర్ , త‌నికెళ్ల భ‌ర‌ణి, వైవా వ‌ర్ష , త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. పూర్తిగా న‌వ్వుల‌ను పండించారు. ఇక ప్రియ‌ద‌ర్శికి ఈ ఏడాది రెండో చిత్రం కావ‌డం విశేషం. ఈ రెండూ మంచి స‌క్సెస్ ను అందుకున్నాయి.

Sarangapani Jathakam Movie Success

ప్ర‌ముఖ న‌టుడు నాని నిర్మించిన కోర్ట్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించాడు ప్రియ‌ద‌ర్శి. త‌న‌లో అద్భుత‌మైన న‌టుడు దాగి ఉన్నాడ‌ని నిరూపించాడు. ఇక సారంగ‌పాణి జాత‌కంలో(Sarangapani Jathakam) డిఫ‌రెంట్ రోల్ పోషించాడు. ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మినిమంగ గ్యారెంటీ క‌లిగిన న‌టుడిగా గుర్తింపు పొందాడు. దీంతో త‌న‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి సినిమాలు. సారంగ‌పాణి జాత‌కం చిత్రాన్ని శివ‌లెంక ప్ర‌సాద్ నిర్మించారు. ఇక ఎప్ప‌టి లాగే ద‌ర్శ‌కుడు త‌న‌దైన మార్క్ ను చూపించాడు ఇందులో.

సినిమాను ఎక్కడా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు. మంచి ఆరోగ్య‌క‌ర‌మైన , కుటుంబమంతా క‌లిసి చూసేలా తీసినందుకు అభినందించాల్సిందే. మెల మెల్ల‌గా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల వ‌ద్ద‌కు రావడం ప్రారంభించారు. బ‌య‌ట టాక్ కూడా పాజిటివ్ గా ఉండ‌డంతో పెట్టిన ఖ‌ర్చు తిరిగి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు మూవీ మేక‌ర్స్. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 2 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది సారంగ‌పాణి జాతకం. రాబోయే రోజుల్లో అంచనాలకు మించి క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని భావిస్తున్నారు సినీ విమ‌ర్శ‌కులు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com