Sarangapani Jathakam : ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన పూర్తి వినోదాత్మక చిత్రం సారంగపాణి జాతకం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్ తో పాటు ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. రూపా కొడియార్, ప్రియదర్శి, వైవా వర్ష కీలక పాత్రలు పోషించారు. పూర్తిగా ఇంటిల్లిపాది చూసేలా రూపొందించారు దర్శకుడు. సినిమా పట్ల పేషన్ కలిగిన దర్శకుడు కావడంతో మూవీ మరింత ఆసక్తికరంగా మారింది. సారంగపాణి జాతకంతో పాటు మరో తెలుగు మూవీ చౌర్య పాఠం కూడా విడుదలైంది. ఈ రెండింటిలో ఏ చిత్రాన్ని ఆదరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Sarangapani Jathakam Movie Sensational
ఇక సారంగపాణి జాతకంలో(Sarangapani Jathakam) కీ రోల్ పోషించాడు విలక్షణ కమెడియన్ వెన్నెల కిషోర్. విమర్శకుల ప్రశంసలు అందుకుంది కామెడీ ఎంటర్ టైనర్ . ఇంద్రగంటి గతంలో తీసిన సినిమాలు మంచి ఆదరణ పొందాయి. తనకంటూ ఓ అభిమానులను ఏర్పర్చుకున్నారు దర్శకుడు. జెంటిల్మెన్ తో పాటు సమ్మోహన్ తీశాడు . మరికొన్ని సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. పరాజయం పాలయ్యాయి. కాగా సారంగపాణి జాతకం గత ఏడాది డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. పుష్ప, తదితర టాప్ చిత్రాలు రావడంతో దీనిని ఇంకాస్త ముందుకు జరిపారు.
వేసవి కాలంలో సారంగపాణి జాతకం రావడం, ఆశించిన దానికంటే నవ్వులు పూయించడంతో మూవీ మేకర్స్ తో పాటు ఇందులో పాలు పంచుకున్న వారంతా సంతోషానికి లోనవుతున్నారు. ఇప్పటికే పాటలు కూడా అలరించాయి. ప్రధానంగా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ల నటన ఆశించిన దానికంటే ఎక్కువగా ఆకట్టుకునేలా నటించారంటూ చూసిన వారు చెబుతున్నారు. ఓవర్సీస్ లో అయితే ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సారంగపాణి జాతకం ఏ మేరకు కంటిన్యూగా ఆకట్టుకుంటుందనేది వేచి చూడాలి.
Also Read : Beauty Janhvi Kapoor :తమిళ్ వెబ్ సీరీస్ లో జాన్వీ కపూర్..?