Zebra : సత్య దేవ్, కన్నడ స్టార్ హీరో కలిసి నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ గత ఏడాది నవంబర్ 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన లభించింది. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో ఓటీటీలో అలరించేందుకు సిద్దంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాలేక పోయినా యావరేజ్ గా వసూళ్లు సాధించింది. పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ , నిజమైన సంఘటనల ఆధారంగా జీబ్రా(Zebra)ను తెరకెక్కించారు దర్శకుడు.
Zebra Movie OTT Updates
ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్ డిసెంబర్ 20న ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. పెట్టిన పెట్టుబడి దీని ద్వారా వచ్చేసినట్టు టాక్. కన్నడ, తమిళ డబ్బింగ్ వెర్షన్ లను లయన్స్ గేట్ ప్లే లో మే 16న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈశ్వర్ కార్తీక్ జీబ్రాకు దర్శకత్వం వహించగా ప్రియా భవానీ శంకర్, సునీల్, సత్యారా కీలక పాత్రల్లో మెరిశారు.
సత్యదేవ్, ధనంజయ కెరీర్ లో జీబ్రా మరిచి పోలేని చిత్రంగా మారిందని పేర్కొన్నారు. నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు ఆధారంగా చేసుకుని తీశారు మూవీ మేకర్. కన్నడ నాట ధనంజయకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తెలుగులో సత్య దేవ్ కు మినిమం గ్యారెంటీ నటుడిగా గుర్తింపు ఉంది. మొత్తంగా సినీ ప్రేక్షకులకు అందమైన అనుభూతి మిగిలేలా చేస్తుంది ఈ జీబ్రా అని చెప్పక తప్పదు.
Also Read : Hero Suriya-Retro :రిలీజ్ కాకుండానే రెట్రో రికార్డ్