ఇండియాలో ఓటీటీల హవా కొనసాగుతోంది. తాజాగా సోనీ లీవ్ లో భారత దేశంలో బిగ్ స్కాంకు పాల్పడిన తెల్గీ కథను తెర కెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు తుషార్ హీరా నందని. ఇందుకు సంబంధించి దీనికి స్కామ్ 2003 – ది తెల్గీ స్టోరీ అని పేరు పెట్టాడు.
హన్సల్ మెహతా కో డైరెక్టర్ గా నిర్వహించారు. 2000 సంవత్సరంలో అబ్దుల్ కరీం తెల్గీ చేసిన స్టాంపు పేపర్ల కుంభ కోణం దేశాన్ని ఒక ఊపేసింది. ఈ ధారా వాహిక (వెబ్ సీరీస్ ) సంజయ్ సింగ్ రాసిన తెల్గీ స్కాం – రిపోర్టర్స్ కి డైరీ నుండి ప్రేరణ పొందింది.
కథా నాయకుడిగా గగన్ దేవ్ రియర్ నటించారు. ముఖేష్ తివారీ, సనా అమీన్ షేక్ , భరత్ జాదవ్ , షాద్ రాంధవా కీలక పాత్రల్లో నటించారు. మొదటి 5 ఎపిసోడ్స్ సెప్టెంబర్ 1 నుండి సోనీ లీవ్ ద్వారా రిలీజ్ అయ్యాయి. ఈ స్కాం మామూలుది కాదు. భారతీయ స్కామ్ లలో అతి పెద్దది. రూ. 30,000 వేల కోట్ల కుంభకోణం చోటు చేసుకుంది.
ఎంతో మంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు స్కామ్ 2003 తెల్గీ స్టోరీ కోసం. టీజర్ ఆకట్టుకుంటోంది.