అమరావతి – సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్దార్థ్ కౌశల్ సంచలన ప్రకటన చేశారు. తాను స్వచ్చంధంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తను పోలీస్ అధికారిగా వివిధ విభాగాలలో 13 ఏళ్లకు పైగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు తనే స్వయంగా ప్రకటన విడుదల చేశారు. తన నిర్ణయం కేవలం తన వ్యక్తిగతమని, ఎవరి ఒత్తిళ్లకు తాను లొంగి ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు సిద్దార్థ్ కౌశల్.ఈ చర్య తన దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు, తన కుటుంబ సభ్యుల కోరికలకు అనుగుణంగా జరిగిందని స్పష్టం చేశారు.
జీవితంలో తను ఐపీఎస్ కావాలని అనుకున్నాని, దానిని సాధించానని, సమర్థవంతంగా విధులు నిర్వహించానని, అప్పగించిన పనులను బాధ్యతతో నిర్వహించడం జరిగిందన్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ రాజీనామా చేసినందుకు కొంత బాధ కూడా ఉందన్నారు. ఏపీలో ఇన్నేళ్లుగా తాను పని చేస్తానని అనుకోలేదన్నారు సిద్దార్థ్ కౌశల్. ఏపీని తన స్వంత ఇంటిగా భావించానని, అందుకే కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉన్నానని, మీరు అందించిన సహకారం మరిచి పోలేనని చెప్పారు .
అయితే గత కొంత కాలంగా తనపై వేధింపులు పెరిగాయని, అంందుకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఇదంతా పూర్తిగా నిరాధారమని, అవన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫిసర్.