Shraddha Kapoor : స్త్రీ2 మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్(Shraddha Kapoor). ఈ ముద్దుగుమ్మ తారక్ తో నటించేందుకు ఓకే చెప్పింది. ఆ మధ్యన బన్నీ నటించిన పుష్ప2లో స్పెషల్ సాంగ్ కోసం నటించేందుకు ఆఫర్ వచ్చినా తిరస్కరించింది. దీంతో ఆ సాంగ్ లో నటించింది కన్నడ బ్యూటీ శ్రీలీల.
Shraddha Kapoor War 2 Movie
ఎవరూ ఊహించని రీతిలో వార్ 2 మూవీలో ప్రత్యేక పాటలో నటించేందుకు ఒప్పుకోవడం బిటౌన్ ను విస్తు పోయేలా చేసింది. తను నటించిన స్త్రీ2 బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ ఏకంగా రూ. 500 కోట్లు వసూలు చేసింది. పరిశ్రమలో అపారమైన ప్రజాదరణ ఉంది. కానీ ఎన్నో ఆఫర్లను తను తిరస్కరించింది.
తను మంచి డ్యాన్సర్ గా గుర్తింపు పొంది. తన అద్భుతమైన నృత్య కదలికలు, నటనకు పేరొందింది. తను పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో తళుక్కున మెరిసింది శ్రద్దా కపూర్. పారితోషకం విషయంలోనే వర్కవుట్ కానందుకే తను పుష్ప2లో ఐటం సాంగ్ ను వదులుకుందని టాక్.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2 మూవీ భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లతో కలిసి తను నటించనుంది. ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరో కీలక ఫిమేల్ రోల్ లో మరో అందాల నటి కియారా అద్వానీ నటిస్తోంది. దీంతో వార్ 2 మూవీపై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.
Also Read : ‘అఖ్రీ సోమవార్’ అందమైన ప్రేమ కథ