Shruti Haasan : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న నటీమణులలో శ్రుతీ హాసన్ కూడా ఒకరు. తను ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటుంది. తన జీవితంలో తనకు బలంగా, మద్దతుగా ఉన్న వ్యక్తి తన తండ్రి, నటుడు కమల్ హాసన్ పేర్కొంది. కీలక సినిమాలలో బిజీగా మారింది. టాప్ హీరోయిన్లలో తను కూడా ఒకరుగా ఉంది. తను తొలిసారిగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లో నటించింది. దీనికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Beauty Shruti Haasan Emotional
డైలాగులు, టేకింగ్, మేకింగ్ సూపర్ గా ఉండడంతో తనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. ఇక శృతీ హాసన్(Shruti Haasan) నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అంతే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా గుర్తింపు పొందింది. అయితే ప్రేమ విషయంలో తను ఆశించినంతగా దక్కలేదంటూ వాపోయింది. ఇప్పటికే తన లైఫ్ లో ముగ్గురితో లవ్ లో పడింది. కానీ వారు తనను సంతృప్తి పర్చలేక పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ముగ్గురితో నడిపిన పీకల లోతు ప్రేమాయణం ఆశించిన మేర వర్కవుట్ కాలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైంది. నా వైపు చూస్తే తాను అత్యంత నిజాయితీగా ఉన్నానని, కానీ అటు వైపు నుంచి స్పందన రాలేదని వాపోయింది. ఇదే సమయంలో కొంత మానసికంగా ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఏదో ఒక వ్యాధి తనను వెంటాడుతున్నట్లు తెలిపింది. దీనిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వెంటనే శృతి హాసన్ కోలుకోవాలని ప్రార్థించారు.
Also Read : Retro Movie Success :కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ రెట్రో బిగ్ సక్సెస్