Shruti Haasan Shocking :మోస పోయినా ప్రేమిస్తూనే ఉంటా

కీల‌క కామెంట్స్ చేసిన శ్రుతి హాస‌న్

Shruti Haasan Shocking

Shruti Haasan : స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తాను మోస పోయినా ఇంకా ప్రేమిస్తూనే ఉంటాన‌ని, దానిని ఆప‌బోనంటూ పేర్కొన్నారు. ప్ర‌తి మ‌నిషికి ఓ అంద‌మైన‌, విఫ‌ల‌మైన ప్రేమ క‌థ త‌ప్ప‌కుండా ఉంటుంద‌న్నారు. అంద‌రి లాగా తాను కూడా ప్రేమ‌లో ప‌డ్డాన‌ని చెప్పింది. ల‌వ్ అనేది లేక పోతే జీవితాన్ని ఎంజాయ్ చేయ‌డం లేద‌న్నారు. త‌న‌తో ఎవ‌రైనా స‌న్నిహితంగా ఉంటే చాలా మంది త‌నను గేలి చేశార‌ని, వెనుక నుంచి కామెంట్స్ చేయ‌డం మొద‌లు పెట్టారంటూ వాపోయింది శ్రుతి హాస‌న్.

Shruti Haasan Shocking Comments

త‌న‌ను ఎన్నో బాయ్ ఫ్రెండ్ అంటూ ముఖం మీదే అడిగారంటూ తెలిపింది. తాను కూడా మ‌నిషినేన‌ని, త‌న‌కు కూడా అంద‌రి లాగా ఫీలింగ్స్ ఉంటాయ‌ని , ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని స్ప‌ష్టం చేసింది న‌టి. త‌న‌కు సంతోషంగా ఉండాల‌ని అనిపిస్తుంది. సినిమాల‌లో న‌టించినంత మాత్రాన ఎవ‌రూ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి కారంటూ పేర్కొంది. తమ‌కు కూడా సామాన్యుల లాగానే ఫీలింగ్స్ తో పాటు కోరిక‌లు ఉంటాయ‌ని అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరింది శ్రుతి హాస‌న్(Shruti Haasan). నాకు ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి నాకు అన్నీ మా నాన్నే లోకం. క‌మ‌ల్ హాస‌న్ అద్భుత‌మైన న‌టుడు. అంతే కాదు గొప్ప మాన‌వ‌త్వం క‌లిగిన వ్య‌క్తి.

ఆయ‌న నుంచి తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని చెప్పింది. అయితే తాను కోరుకున్న ల‌వ్ ఇప్ప‌టికీ ద‌క్క‌లేద‌ని , అందుకే అన్వేషిస్తున్నానంటూ తెలిపింది. నేను చాలా మందితో సన్నిహితంగా మెలిగాను. వారి నుంచి ప్రేమ‌ను పొందాను. కానీ పూర్తి కాలం గ‌డిపేందుకు కావాల్సిన ల‌వ్ వారి నుంచి త‌న‌కు ద‌క్క‌లేద‌ని వాపోయింది. అందుకే వారి నుంచి వేరుగా ఉంటున్న‌ట్లు చెప్పింది. ఈ విష‌యంలో త‌న మాజీ బాయ్ ఫ్రెండ్ ల‌పై కామెంట్స్ చేయ‌నంటూ చెప్పింది. తాజాగా శ్రుతి హాస‌న్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : Hero Vijay Sethupathi-Nivetha :విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న నివేదా థామ‌స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com