Beauty Shruti Haasan – Neel :తార‌క్ నీల్ మూవీలో ల‌వ్లీ బ్యూటీ

శ్రుతీ హాస‌న్ కీ రోల్ పోషిస్తోంది

Beauty Shruti Haasan - Neel

Shruti Haasan : పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తీసింది కొన్ని సినిమాలే. కానీ సూప‌ర్ డూప‌ర్ హిట్, బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచేలా చేశాడు. త‌న చేతిలో ఎవ‌రు ఉన్నార‌నే దానిని త‌ను ప‌ట్టించుకోడు. త‌న స్టైల్, మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. కథకే ప్ర‌యారిటీ ఇస్తాడు. హీరో హీరోయిన్ల గురించి దృష్టి సారించ‌డు. త‌న రూటే స‌ప‌రేట్ అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు ప్ర‌శాంత్ నీల్. త‌ను ఒక్క‌సారి క‌మిట్ అయ్యాడంటే ఇంక ఎవరినీ ప‌ట్టించుకోడు. త‌ను సినిమా తీస్తున్నాడంటే దానికి ఓ ప్ర‌యోజ‌నం ఉంటుంది.

Shruti Haasan – Prasanth Neel Movie

సామాజిక సందేశం ఇచ్చే ప‌ని కూడా చేయ‌డు. కానీ ప్ర‌తి మూవీకి ఓ ప్ర‌త్యేక‌మైన మెస్సేజ్ అనేది త‌ప్ప‌కుండా ఉంటుంది. ఇది ఆయ‌నకు ఉన్న ప్ర‌త్యేక‌త‌. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. కార‌ణం ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేకూర్చే ద‌మ్మున్న న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్. త‌న‌తో కొత్త ప్రాజెక్టు ప్ర‌క‌టించాడు ప్ర‌శాంత్ నీల్. దీంతో ఇప్ప‌టికే సినీ మార్కెట్ ను షేక్ చేస్తోంది. గ‌ట్స్ ఉన్న డైరెక్ట‌ర్ కు ద‌మ్మున్న హీరో దొరికితే ఆ మూవీ ఎలా ఉంటుందో చెప్పేదేముంది…?

ఇప్ప‌టికే తార‌క్ న‌టించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది. ఈ ఇద్ద‌రి క్రేజీ కాంబినేష‌న్ లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతోంది. షూటింగ్ ప్రారంభ‌మైంది ఘ‌నంగా. కొన్నాళ్ల కింద‌టే దీనిని అనౌన్స్ చేశాడు. అయితే ఎవ‌రు న‌టిస్తున్నార‌నేది ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు ప్ర‌శాంత్ నీల్. తాజాగా ఈ మూవీలో కీ రోల్ పోషించేందుకు హీరోయిన్ గా శ్రుతీ హాస‌న్(Shruti Haasan) ను ఎంపిక చేసిన‌ట్లు టాక్. దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ విష‌యం గురించి శాండిల్ వుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Also Read : Sarangapani Jathakam Sensational : న‌వ్వుల లోకం సారంగ‌పాణి జాత‌కం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com