Shruti Haasan: నెటిజన్‌పై శ్రుతీహాసన్ ఆగ్రహం కారణం ఏంటంటే ?

నెటిజన్‌పై శ్రుతీహాసన్ ఆగ్రహం కారణం ఏంటంటే ?

Hello Telugu - Shruti Haasan

Shruti Haasan: యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతీహాసన్… సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన యొక్క వృత్తి, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూనే… నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నపై నటి శ్రుతి హాసన్‌ మండిపడ్డారు. ‘మాలా ఉండేందుకు ప్రయత్నించకండి?’ అంటూ సదరు వ్యక్తికి గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. ‘సౌత్‌ ఇండియన్‌ యాసలో ఏదైనా చెప్పండి ?’ అంటూ సదరు నెటిజన్‌ అడగగా ఆమె ఈ విధంగా స్పందించారు. ‘‘ఓకే.. ఇలాంటి వివక్షలే వద్దు. మీరు మమ్మల్ని చూసి ఇడ్లీ, సాంబార్‌ అని అనడం సరైంది కాదు. మీరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దు’’ అని అన్నారు.

Shruti Haasan Serious..

బాలీవుడ్‌ నటులు… దక్షిణాది నటులను చిన్నచూపు చూస్తుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చారేమోనని పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలు వెబ్‌సైట్స్‌ ఇదే కోణంలో వార్తలు రాశాయి. కొన్ని నెలల క్రితం జరిగిన అనంత అంబానీ పెళ్లి వేడుకలో షారుక్‌ఖాన్… రామ్‌చరణ్‌ను ఉద్దేశించి సరదాగా ఇడ్లీ, సాంబర్‌ అనడంపై పెద్ద చర్చే జరిగింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని శ్రుతీ(Shruti Haasan) ఇలా స్పందించిందని, తన అసహనానికి అదే కారణమని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘డెకాయిట్‌’, ‘చెన్నై స్టోరీ’ల్లో నటిస్తున్నారు. ‘సలార్‌’ సీక్వెల్‌ ‘సలార్‌ 2’ లోనూ ఆమె నటించనుంది.

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శృతి హాసన్‌(Shruti Haasan). కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ శృతి హాసన్‌ సొంత ఇమేజ్ తో సక్సెస్‌ లను సొంతం చేసుకుని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పిస్తోంది. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్స్ లో మల్టీ టాలెంటెడ్‌ హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందులో ఈమె ముందు వరుసలో ఉంటుంది శృతి హాసన్‌. సింగర్‌ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా ఇలా ఎన్నో విధాలుగా శృతి హాసన్‌ వర్క్ చేసిన విషయం తెల్సిందే. ఇటీవల ఒక మ్యూజిక్ ఆల్బమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

Also Read : Allu Arjun: అల్లు అర్జున్‌ కు ‘క్రాక్‌’ జయమ్మ స్పెషల్ ఇన్విటేషన్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com