తమిళ సినీ రంగంలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ ఎస్ జే సూర్య. సినిమాపై మంచి పట్టుంది. ఆ మధ్యన దర్శకుడు మురుగ దాస్ మహేష్ బాబుతో తీసిన చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు మెప్పించాడు.
తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డుల ప్రదానోత్సవంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు ఎస్ జే సూర్య. కారణం తను నటించిన ప్రతి నాయకుడి పాత్ర కేటగిరీ కింద అత్యుత్తమ అవార్డును అందుకున్నాడు తమిళ సినీ నటుడు.
ఆయన అద్భుతమైన దర్శకుడు కూడా. మంచి ఫిలాసఫీ కూడా చెబుతాడు. జీవితం మన చేతుల్లో లేనప్పుడు రాబోయే దాని గురించి ఎందుకు ఆలోచించాలని అంటాడు ఎస్ జే సూర్య. ఏ పాత్ర ఇచ్చినా సరే దానిలో లీనమై పోయి నటించడం అలవాటు చేసుకున్నాడు.
ఈ మధ్యన ఆయనకు ఎక్కువగా హీరోతో పోటీ పడే ప్రతి నాయకుడి పాత్రలే దక్కుతున్నాయి. ఎస్ జే సూర్యకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆయన మాటలు, నటన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే అవార్డుకు అర్హుడని జ్యూరీ కమిటీ పేర్కొంది.