Hero Salmaan Khan-Sikandar :స‌ల్మాన్ ఖాన్ సికంద‌ర్ కు భారీ డిమాండ్

సినిమాకు అస్సెట్ గా మారిన ర‌ష్మిక

Sikandar : బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ , నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన చిత్రం సికింద‌ర్ దుమ్ము రేపుతోంది. ఈ చిత్రం ఆశించిన దానికి మించి వ‌సూళ్లు చేయ‌డం విస్తు పోయేలా చేసింది సినీ క్రిటిక్స్ ను. ద‌మ్మున్న డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంద‌ని టాక్ . దీంతో పెట్టిన పెట్టుబ‌డి తిరిగి రావ‌డం ప‌క్కా అంటున్నారు. గ‌తంలో రిలీజ్ అయిన ఇత‌ర సినిమాల క‌లెక్ష‌న్స్ తో పోటీ ప‌డుతోంది సికంద‌ర్.

బుక్ మై షోలో అత్య‌ధికంగా టికెట్లు అమ్ముడు పోయాయి. దీంతో సికింద‌ర్(Sikandar) మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడు స‌ల్మాన్ ఖాన్. ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా. గ‌తంలో స‌ల్మాన్ ఖాన్ , దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ రికార్డ్ బ్రేక్ చేసింది. మొద‌టి ఆదివారం ఏకంగా రూ. 80 కోట్లు వ‌సూలు చేసింది. బాలీవుడ్ లో ఇప్ప‌టి దాకా ఇదే టాప్.

Sikandar Movie Updates

ఆ త‌ర్వాతి స్థానంలో ర‌ణ‌బీర్ క‌పూర్, ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన వంగా సందీప్ రెడ్డి తీసిన యానిమ‌ల్ తొలి రోజు రూ. 70 కోట్లు కొల్ల‌గొట్టింది. స్త్రీ, గ‌ద‌ర్ టాప్ 5 చిత్రాల‌లో నిలిచాయి. ప‌ఠాన్ రూ. 60.75 కోట్లు, స్ట్రీ రూ. 58.20 కోట్లు, గ‌దర్ రూ. 51.70 కోట్లు, ఛావా రూ. 49..03 కోట్లు, టైగ‌ర్ జిందా హై రూ. 45.53 కోట్లు,
టైగ‌ర్ రూ. 44.75 కోట్లు, బ్ర‌హ్మాస్త్ర రూ. 43.50 కోట్లు వ‌సూలు చేశాయి. ప్ర‌స్తుతానికి ట్రెండ్ ను బ‌ట్టి చూస్తే రూ. 45 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించ‌డం ఖాయ‌మంటున్నారు సినీ విమ‌ర్శ‌కులు.

Also Read : Mad Square Sensational : మ్యాడ్ సెన్సేష‌న్ క‌లెక్ష‌న్స్ ధ‌నా ధ‌న్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com