Pawandeep Rajan : ఇండియన్ ఐడల్ విజేత పవన్ దీప్ రాజన్ తీవ్రంగా గాయపడ్డాడు. తాను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. సింగర్ తో పాటు మరో ఇద్దరూ ఇందులో ప్రయాణిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని చంపావత్ నుండి ఢిల్లీకి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లేందుకు బయలుదేరారు. ఈ ఘటన యూపీలోని అమ్రమోహ్ లోని 9వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గజ్రౌలా పోలీస్ స్టేషన్ CO కార్యాలయం సమీపంలో జరిగింది.
Pawandeep Rajan Met with Accident
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పవన్‌దీప్(Pawandeep Rajan) ప్రయాణిస్తున్న MG హెక్టర్ కారు వెనుక నుండి ఆపి ఉంచిన ఐషర్ క్యాంటర్‌ను ఢీకొట్టింది. గజ్రౌలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అఖిలేష్ ప్రధాన్ మాట్లాడుతూ వాహనం వెనుక నుండి ఆపి ఉంచిన ఐషర్ క్యాంటర్‌ను ఢీకొట్టింది అని అన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ప్రథమ చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత దృష్ట్యా, వారిని నోయిడాలోని ఆసుపత్రికి తరలించారు.పవన్‌దీప్ తన స్నేహితుడు అజయ్ మెహ్రా, డ్రైవర్ రాహుల్ సింగ్‌తో కలిసి ప్రయాణిస్తున్నాడు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ చక్రం వద్ద నిద్రపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పవన్‌దీప్ రెండు కాళ్లలో పగుళ్లు, తలకు గాయం అయింది. తరువాత అతన్ని నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను ప్రస్తుతం ఆర్థోపెడిక్స్ బృందం సంరక్షణలో ఉన్నాడు. దెబ్బ తిన్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Dancer Janu Marriage Shocking :గాయకుడు దిలీప్ తో డ్యాన్సర్ జాను లిరి పెళ్లి
