ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో బాలయ్య నటించిన డాకు మహారాజ్ కాగా మరోటి నాని నిర్మించిన కోర్టు. సమంత నిర్మించిన శుభం చిత్రం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సారంగపాళి జాతకం. ఇందులో వెన్నెల కిషోర్ పండించిన కామెడీకి మంచి ఆదరణ లభించింది.
ఇదే సమయంలో నటుడిగా వంద మార్కులు కొట్టేశాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రియదర్శి పులికొండ. తనకు ఈ ఇయర్ సంతోషాన్ని కలిగించేలా చేసింది. తాజాగా విష్ణు, వెన్నెల కిషోర్ పోటీ పడి నటించిన చిత్రం సింగిల్. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్ రావడంతో భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా సింగిల్ మూవీ టీం సక్సెస్ ఈవెంట్స్ లో పాల్గొంటోంది. సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి సింగిల్ ను చేజిక్కించుకునేందుకు.
చివరకు ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని చేజిక్కించుకుంది భారీ ధరకు. మరో వైపు కోర్టు మూవీని నెట్ ఫ్లిక్స్ రూ. 8 కోట్లకు తీసుకుంది. వెన్నెల కిషోర్, కేతిక శర్మ, ఇవానా ఇతర పాత్రల్లో నటించారు. థియేటర్లలో నవ్వులు పూయించింది. సింగిల్ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. దీనిని గీతా ఆర్ట్స్ నిర్మించింది. శ్రీ విష్ణు తన విలక్షణమైన కామెడీని పండించాడు.