Beauty Sonakshi Sinha- Jatadhara :సోనాక్షి సిన్హా జ‌టాధ‌ర ఫ‌స్ట్ లుక్ రిలీజ్

తొలి తెలుగు చిత్రంలో న‌టిస్తున్న న‌టి

Jatadhara : టీఎంసీ ఎంపీ శ‌త్రుఘ్న సిన్హా ముద్దుల కూతురు సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన చిత్రం జటాధ‌ర‌. ఈ చిత్రానికి సంబంధించి మూవీ మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుద‌లైన కొన్ని నిమిషాల‌లోనే వ్యూయ‌ర్షిప్ రావ‌డం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండ‌గా సోనాక్షి సిన్హా చివ‌రిసారిగా హార‌ర్, కామెడీ కాకుడ‌, హీరా మండిలో క‌నిపించింది.

Jatadhara Movie 1st Look

జ‌టాధ‌ర చిత్రానికి వెంక‌ట్ క‌ళ్యాణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మేక‌ర్స్ ఇన్ స్టా గ్రామ్ లో సోనాక్షి సిన్హాకు(Sonakshi Sinha) సంబంధించిన పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు. ఆక‌ట్టుకునే చూపు, ఆక‌ర్ష‌ణీయ‌మైన క‌ళ్లు మ‌రింత రాటుదేలా ఉన్నాయి.

ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా సంపూర్ణ దేవత శక్తిని వెదజల్లుతుంది. ఆమె భారీ బంగారు ఆభరణాలను ధరించి ఉంది. నటి తన ముఖాన్ని కప్పి ఉంచింది, ఆమె కాజల్ పూతతో ఉన్న కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. సోనాక్షి మండుతున్న చూపు ఆమె కళ్ళకు లోతును జోడిస్తుంది. ఆమె జుట్టు అడవి అలలలో తెరిచి ఉంది.

ఇటీవ‌లే సోనాక్షి సిన్హా భ‌ర్త న‌టుడు జ‌హీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా త‌న భార్య జ‌టాధ‌ర ఫ‌స్ట్ లుక్ పై స్పందించారు. అద్భుతంగా ఉన్నావంటూ కితాబు ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో త‌న స‌హ న‌టి హుమా ఖురేషీ కూడా సూప‌ర్ గా ఉన్నావంటూ ప్ర‌శంసించారు. సూప‌ర్ నేచుర‌ల్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ గా రూపొందిస్తున్నారు జ‌టాధ‌ర మూవీని. ఇందులో సుధీర్ బాబు కూడా న‌టిస్తుండ‌డం విశేషం.

Also Read : IIFA Awards 2025-Amar Singh Chamkila :ఉత్త‌మ చిత్రంగా అమ‌ర్ సింగ్ చంకీలా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com