మా ఇద్ద‌రి మ‌ధ్య బంధం స్నేహం మాత్ర‌మే

రాజ్ థాక్రేతో రిలేష‌న్ షిప్ పై సోనాలి బింద్రే

ఎవ‌రు ఎప్పుడు సంచ‌ల‌నంగా మారుతారో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇండియాలో పాలిటిక్స్ , సినీ ఇండ‌స్ట్రీ చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. తాజాగా వైర‌ల్ గా మారారు ప్ర‌ముఖ వ‌ర్ద‌మాన న‌టి సోనాలి బెంద్రే. ఆమె ముంబైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు , బాల్ ఠాక్రే త‌న‌యుడు రాజ్ ఠాక్రేతో చాలా క్లోజ్ గా ఉన్న వీడియో, ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేశాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. ఇవ‌న్నీ వైర‌ల్ గా మారాయి. దీంతో గ‌త్యంత‌రం లేక సోనాలి బింద్రే స్పందించక త‌ప్ప‌లేదు. తామిద్ద‌రి మ‌ధ్య అలాంటిది ఏమీ లేద‌ని పేర్కొంది. త‌మ కుటుంబాల మ‌ధ్య స్నేహం మాత్ర‌మే ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌కంటూ ఓ ఫ్యామిలీ ఉంద‌ని, త‌న‌కంటూ కొన్ని విలువ‌లు ఉన్నాయ‌ని తెలిపింది.

ఇక సోనాలి బింద్రే 1990లో సూప‌ర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు, హిందీ చిత్రాల‌లో టాప్ హీరోయిన్ గా మ‌న‌సు దోచుకుంది. ప్ర‌ధానంగా తెలుగులో వ‌చ్చిన మ‌న్మ‌థుడు మూవీలో త‌న న‌ట‌నకు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇప్ప‌టికీ ఆ మూవీ బుల్లితెర‌పై హ‌ల్ చ‌ల్ చేస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ కామెడీ, అద్భుత‌మైన సన్నివేశాలు, సూప‌ర్ సంభాష‌ణ‌లు మ‌రిచి పోకుండా చేస్తాయి. త‌ను తొలుత ముంబై సినిమాలో స్పెష‌ల్ సాంగ్ తో ఆక‌ట్టుకుంది. రెహ‌మాన్ బాణీ క‌ట్టిన రెమో ఫెర్నాండేజ్ పాడిన హ‌మ్మ హ‌మ్మ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆ త‌ర్వాత శ్రీ‌కాంత్ తో కూడా న‌టించింది.

హిందీలో కూడా పలు సినిమాల‌లో న‌టించింది. ఉన్న‌ట్టుండి త‌ను క్యాన్స‌ర్ వ్యాధికి గురైంది. కానీ త్వ‌ర‌గానే కోలుకుంది. ఇటీవ‌ల కొన్ని ఈవెంట్స్ ల‌లో , రియాల్టీ షోలో ప్ర‌త్యేకంగా క‌నిపించింది. న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించింది. తాజాగా జీ 5 లో వెబ్ సీరీస్ లో న‌టిస్తున్న‌ట్టు టాక్. మొత్తంగా రాజ్ ఠాక్రేతో తాను ల‌వ్ లో ప‌డ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించింది. దీనిని కొట్టి పారేసింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com