Hero Ram Charan-Peddi :పెద్ది మూవీలో శ్రీ‌లీల ఐట‌మ్ సాంగ్

అంచ‌నాలు పెంచుతున్న చిత్రం

Hero Ram Charan-Peddi

Peddi : పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది శ్రీ‌లీల‌. త‌ను ఇప్ప‌టికే స్పెష‌ల్ సాంగ్ లో త‌ళుక్కున మెరిసింది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దేశంలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా వినుతికెక్కిన పుష్ప‌2 మూవీలో స్పెష‌ల్ సాంగ్ లో న‌టించింది శ్రీీలీల‌. తాజాగా త‌ను నితిన్ రెడ్డితో క‌లిసి రాబిన్ హుడ్ లో నటించింది. ఇది ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. అయినా త‌న‌కు ప‌లు సినిమాల‌లో న‌టించేందుకు ఛాన్స్ లు వ‌స్తుండ‌డం విశేషం.

Ram Charan Peddi Movie Updates

టాలీవుడ్ లో దుమ్ము రేపిన శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయ‌న్ తో క‌లిసి ఆషిఖి 3 మూవీలో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన సాంగ్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. పుష్ప 2 మూవీలో చేసిన సాంగ్ కిస్స‌క్ సూప‌ర్ హిట్ కావ‌డంతో త‌న‌పై ఫోక‌స్ పెట్టాడు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న‌. పెద్ది మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన గ్లింప్స్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్(Ram Charan) తో క‌లిసి స్పెష‌ల్ సాంగ్ లో ముద్దుగుమ్మ శ్రీలీల న‌టించ‌నుంద‌ని టాక్.

ఈ మ‌ధ్య‌న స్టార్ హీరోయిన్లు ఒక్క మూవీలోనే ఒకే ఒక్క పాత్ర‌కు ప‌రిమితం కావ‌డం లేదు. వీలైతే దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క బెట్టుకోవాల‌నే ధ్యాస‌లో ఉన్నారు. మంచి సాంగ్ , కిక్ ఎక్కించేలా ఉంటే, రెమ్యూన‌రేష‌న్ అడిగినంత ఇస్తే చాలు న‌టించేందుకు, అందాలు ఆర‌బోసేందుకు సై అంటున్నారు . ఇప్పుడు ఆ కోవ‌లోకి వ‌చ్చేసింది ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల‌. త‌ను పెద్ది మూవీలో ప్ర‌త్యేక సాంగ్ చేసేందుకు ఓకే చెప్పింద‌ని స‌మాచారం. మొత్తంగా పెద్దిలో ఐటం సాంగ్ తో ర‌చ్చ చేసేందుకు రెడీ అవుతోంది అన్న‌మాట‌. ఇక ఫ్యాన్స్ కు ర‌చ్చ రంబోలా పుట్టించ‌డం ఖాయం.

Also Read : హాలీవుడ్ రేంజ్ లో బ‌న్నీ..అట్లీ మూవీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com