Sree Leela : ముద్దుపై ముద్దుగుమ్మ కామెంట్

భర్త‌కు త‌ప్ప ఇంకెవరికీ ఇవ్వ‌ను

టాలీవుడ్ లో టాప్ లో కొన‌సాగుతోంది ల‌వ్లీ గ‌ర్ల్ డాక్ట‌ర్ కోర్సు చ‌దువుతున్న శ్రీ‌లీల‌. పెళ్లి సంద‌డి సీక్వెల్ మూవీలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. స్టార్ హీరోల‌తో ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు.

న‌ట సింహం నంద‌మూరి బాల‌య్య బాబుతో క‌లిసి శ్రీ‌లీల న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న గుంటూరు కారం చిత్రంలో కీల‌క రోల్ న‌టిస్తోంది శ్రీ‌లీల‌.

పంజా వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి ఆది కేశ‌వ చిత్రంలో నటిస్తోంది. మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌తో క‌లిసి న‌టించిన ధ‌మాకా చిత్రం బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఇందులో శ్రీ‌లీల కీల‌క పాత్ర పోషించింది. కేస‌రి చిత్రం విజ‌యం సాధించ‌డంతో మీడియాతో మాట్లాడింది.

లిప్ కిస్ పై ఓకే చేస్తారా అన్న ప్ర‌శ్న‌కు తెలివైన స‌మాధానం ఇచ్చింది శ్రీ‌లీల‌. తన హద్దులు ఏమిటో త‌న‌కు తెలుస‌న్నారు . త‌న భ‌ర్త‌కు త‌ప్ప వేరే ఏ హీరోతో తాను ముద్దు సీన్ లో న‌టించ‌నంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా శ్రీ‌లీల కిస్ పై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com