ఎంగేజ్​మెంట్ కాదు పుట్టిన రోజు వేడుక‌లు

క్లారిటీ ఇచ్చిన ప్ర‌ముఖ న‌టి శ్రీ‌లీల

ల‌వ్లీ బ్యూటీ యాక్ట‌ర్ శ్రీ‌లీల సంచ‌ల‌నంగా మారారు. త‌ను ఈ మ‌ధ్య‌న ఎక్కువ‌గా ఏదో ఒక ర‌కంగా సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ అవుతోంది. అలా చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ ఏడాది త‌ను న‌టించిన రాబిన్ హుడ్ చిత్రం బొక్క బోర్లా ప‌డింది. ఇక పుష్ప 2 లో చేసిన స్పెష‌ల్ సాంగ్ మాత్ర‌మే త‌న‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. తాజాగా త‌న‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

తాజాగా త‌న వ్య‌క్తిగ‌త ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో అద్భుతంగా దిగిన ఫోటోల‌ను పంచుకుంది. దీంతో త‌న‌కు ఎంగేజ్ మెంట్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. నెటిజ‌న్స్ సైతం కంగ్రాట్స్ అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలు కచ్చితంగా నిశ్చితార్థం ఫోటోలేనంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో స్వ‌యంగా శ్రీ‌లీల స్పందించింది. వివాహానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

ప్ర‌త్యేకించి ఈ ఫోటోలకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. త‌ను ప‌సుపు రాసుకొని ఉండ‌డం, పూర్తిగా సంప్రదాయ బ‌ద్దంగా దుస్తులు ధ‌రించ‌డం మ‌రింత ఆస‌క్తిని రేపింది. బిగ్ డే క‌మింగ్ సూన్ అంటూ క్యాప్షన్ కూడా పేర్కొన‌డంతో అంద‌రూ అయ్యో శ్రీ‌లీల‌కు అప్పుడే పెళ్లి అయి పోతోందా అంటూ కామెంట్స్ చేశారు.

మ‌రో వైపు త‌ను కార్తీక్ ఆర్య‌న్ తో క‌లిసి హిందీలో ఆషికి -3 మూవీలో న‌టిస్తోంది. ఇది పూర్తిగా రొమాంటిక్ చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే ఆర్య‌న్ శ్రీ‌లీల కొంత కాలం పాటు డేటింగ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com