సినీ ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మగా పేరు పొందింది లవ్లీ బ్యూటీ శ్రీలీల. తనకు ఈ ఏడాది కేవలం ఒకే ఒక్క సినిమా ఆశించిన మేర ఆడింది. అది తను నటించింది కేవలం స్పెషల్ సాంగ్ లో మాత్రమే. కిస్సక్ అంటూ పలకరించింది. యువతను కిర్రాక్ తెప్పించింది. ఒక రకంగా గుండెలను మీటింది. మెస్మరైజ్ చేసింతి తన డ్యాన్స్ తో . ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం పుష్ప -2 ది రూలర్. ఇందులో ప్రత్యేక పాటలో నటించింది. కిస్సక్ అంటూ కైపెక్కించేలా చేసింది.
పుష్ప 1లో సమంత రుత్ ప్రభు ఊ అంటా ఊఊ అంటావా అని గుండెల్లో గుబులు రేపింది. ఇదిలా ఉండగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన రాబిన్ హుడ్ ఆశించిన మేర ఆడలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీనికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్ రెడ్డి హీరోగా నటించాడు. కథ పరంగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో ప్రేక్షకులు అంతగా ఆదరించ లేదు. దీనికి తమిళ సినీ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించారు.
పాటలు ఆకట్టుకున్నా సినిమాలో దమ్ము లేక పోవడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న శ్రీలీల ఆశలపై నీళ్లు చల్లింది. ఇక తన చేతిలో ఒకే ఒక్క మూవీ ఉంది. అంది హిందీలో ఆషిఖి-3 . ఇది పూర్తిగా ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించారు. అయితే శ్రీలీలకు వరుసగా సినిమాలలో ఛాన్సులు రావడం కొంత ఉపశమనం కలిగిస్తోంది.