Bulliraju : సినిమా పరంగా చూస్తే ఎప్పుడు ఎవరిని ఎలా అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. తను ఉన్నట్టుండి ఎలా కంట పడ్డాడో కానీ వచ్చిన ఛాన్స్ ను సద్వినియోగం చేసుకున్నాడు. దర్శకుడు చెప్పినట్టు నటించాడు. ఒకే ఒక్క మూవీతో స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. బుల్లోడు అతడే అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్ , ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరితో కలిసి తీసిన సంక్రాంతికి వస్తున్నాంలో దుమ్ము రేపిన బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్. చూస్తే చిన్నోడైనా మంచి మార్కులు కొట్టేశాడు నటనా పరంగా. కానీ కొంత బూతులు ఎక్కువైనట్లు విమర్శలు వచ్చినా నవ్వులతో నిండి పోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Child Actor Bulliraju New Movie
ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఎక్కడికి వెళ్లినా బుల్లి రాజు(Bulliraju) టాక్ ఆఫ్ ది టౌన్ గా మారి పోయాడు. తనకు భారీ పెత్తున సినిమాలలో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా శ్రీ విష్ణు కీలక రోల్ లో నటిస్తున్న చిత్రం సింగిల్. ఇందులో బుల్లి రాజు(Bulliraju) ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇందులో కూడా కామెడీని పండించాడు. సినిమా ట్రైలర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతమూ వినోదాన్ని పండించేలా ఉంది. రొమాంటిక్ , థ్రిల్లర్ కూడుకుని ఉన్నప్పటికీ కథా పరంగా బుల్లిరాజుతో కామెడీని జొప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
మరో పాత్రలో జీవించేశాడు కమెడియన్ వెన్నెల కిషోర్. తను నటించిన సారంగపాణి జాతకం మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో ప్రియదర్శితో కలిసి నవ్వులు పూయించాడు. ఇక సినిమా విషయానికి వస్తే గతంలో నిను వీడని నీడను నేనే మూవీ ఫేమ్ దర్శకుడు కార్తీక్ రాజు సింగ్ ల్ ను తీస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. బాను ప్రతాప్, రియాజ్ చౌదరి, విద్యా కొప్పినీడి దీనిని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు కేతిక, ఇవానా ఇందులో నటించారు.
Also Read : Vaibhav Suryavanshi Sensational :మామూలోడు కాదు రియల్ టార్చ్ బేరర్
