Srikanth : ‘మా అసోసియేషన్’ తరపున ఆడమంటే ఆడటానికి సిద్ధం..!

ఒకవేళ మా అసోసియేషన్ కోసం ఆడమంటే తప్పకుండా ఆడతాం...

Hello Telugu - Srikanth

Srikanth : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ గురించి నటుడు శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివల్‌ పోస్టర్‌ లాంచ కార్యక్రమంలో ‘మా’ బిల్డింగ్‌ కోసం ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ” ఇప్పుడు నేను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషనలో ఏ పదవిలోనూ లేను. సభ్యుడిని మాత్రమే. కాబట్టి ‘మా’ బిల్డింగ్ కోసం ఆడొచ్చు కదా అంటే నేను సమాధానం చెప్పలేను. అందులో యాక్టివ్‌గా ఉన్నవారు చెప్పాలి.

Srikanth Comment

ఒకవేళ మా అసోసియేషన్ కోసం ఆడమంటే తప్పకుండా ఆడతాం.ఎందుకంటే అది ఆర్టిస్ట్‌లు అందరి సంస్థ. గతంలో కూడా ఆడాము. ఎన్నో సందర్భాల్లో చారిటీ కోసం విదేశాల్లోనే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రికెట్‌ ఆడి నిధులు సేకరించి ఎన్నో విపత్కర పరిస్థితులకు అండగా నిలిచాం. మళ్లీ పాత టీమ్‌లతో కలిసి ఆడాలని ఉంది. అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ఏడాది రెండు ఆటలు ఆడొచ్చు. కానీ ఎవరి పనులతో వారు బిజీగా ఉంటున్నారు. బిజీగా ఉన్న ఆర్టిస్ట్‌లకు డేట్స్‌ కుదరకపోవచ్చు. కుదిరితే మాత్రం ఎక్కడైనా సరే మంచి కాజ్‌ కోసం ఆడటానికి సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. టీసీఎ ఆధ్వర్యంలో నవంబర్‌ 15, 16 తేదీలో ఈ మ్యాచ్ జరగనుంది.

Also Read : Prabhas : ఈ నెల హైయెస్ట్ పాపులర్ హీరోల లిస్టులో డార్లింగ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com