Srinidhi Shetty : హిట్ -3 చిత్రంలో నానితో జత కట్టిన శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులో మాట బయట పెట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యశ్ కీలక పాత్ర పోషించిన చిత్రం కేజీఎఫ్. ఇది భారతీయ సినిమాను షేక్ చేసేలా చేసింది. కోలార్ నేపథ్యంతో సాగిన కథను అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇందులో శ్రీనిధి శెట్టికి(Srinidhi Shetty) కూడా ఓ రోల్ ఇచ్చాడు. ఆ సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కాసుల వర్షం కురిపించింది. అటు యశ్ కు ఇటు దర్శకుడికి, నటి శెట్టికి మంచి పేరు వచ్చింది.
Srinidhi Shetty Movie Updates
ఈ సందర్బంగా తన సినీ కెరీర్ లో మరిచి పోలేని సన్నివేశం ఏదైనా ఉందంటే అది కేజీఎఫ్ అని పేర్కొంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించేందుకు అవకాశాలు వచ్చాయని తెలిపింది. కానీ మంచి పాత్రలు ఉంటేనే తాను ఓకే చెబుతున్నానని చెప్పింది. తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి హిట్ 3లో తెర పంచుకోవడం తనను మరింత సంతోషానికి గురయ్యేలా చేసిందని తెలిపింది. తను ఎంత సేపు స్క్రీన్ మీద కనిపిస్తానని పట్టించుకోనని చెప్పింది. కానీ పాత్ర బాగుండాలి. అంతకు మించి కథ నచ్చాలని పేర్కొంది.
యశ్ తో పాటు రీనా దేశాయ్ పాత్రను పోషించింది శ్రీనిధి శెట్టి. దీనిని హోంబాలే ఫిల్మ్స్ నిర్మించింది. ఆ సినిమా విడుదలయ్యాక తనను అంతా పూలకుండీ అని పిలవడం ప్రారంభించారని, అలా పిలిపించు కోవడం తనను మరింత ఉత్తేజితురాలిని చేస్తూ వచ్చిందని తెలిపింది. 2022లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తమిళ మూవీలో సూపర్ స్టార్ విక్రమ్ చియాన్ తో కలిసి నటించింది ఈ 32 ఏళ్ల నటి. ప్రస్తుతం హిట్ 3పై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా పక్కా సక్సెస్ అవుతుందని అంటోంది.
Also Read : Hero Prabhas – Bahubali :జక్కన్న బాహుబలి రీ రిలీజ్