Mahabharat : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. తాను భారతీయ ఇతిహాసం మహాభారతంపై సినిమా తీయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అంతే కాదు ఇందు కోసం ఇప్పటి నుంచే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సినిమా రంగంలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తను టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కీ రోల్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి ఎస్ఎస్ఎంబీ29 మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ పూర్తి కాలేదు. కానీ మార్కెటింగ్ మాత్రం జోరుగా సాగుతోంది. ఇదే తన స్పెషాలిటీ.
Hero Nani got Mahabharat Movie Chance
విచిత్రం ఏమిటంటే ఎస్ఎస్ రాజమౌళి సినిమాను ఇతర దర్శకులకంటే భిన్నంగా తీస్తాడు. గతంలో మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, శంకర్, సుభాష్ ఘాయ్ లాంటి దర్శకుల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. మొత్తం యావత్ భారతీయ సినిమాను దక్షిణాది సినిమా రంగానికి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలు ఏలుతున్నారు. వారిలో సుకుమార్ , అట్లీ కుమార్, మారి ముత్తు, వెట్రి మారన్, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, కార్తీక్ సుబ్బరాజ్, తదితరులు లెక్కకు మించి దుమ్ము రేపుతున్నారు.
మొత్తంగా సినీ రంగంలో దమ్మున్న సాంకేతిక నిపుణులతో కళ కళ లాడుతోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన నాని నటించిన హిట్ 3 మూవీ ప్రమోషన్ కార్యక్రమానికి తన భార్యతో కలిసి హాజరయ్యాడు జక్కన్న. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తీసే మహాభారతం(Mahabharat) చిత్రంలో తప్పకుండా నేచురల్ స్టార్ కు ఛాన్స్ ఉంటుందని ప్రకటించాడు. దీంతో నాని అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు. ఏది ఏమైనా రాజమౌళినా మజకా అంటున్నారు సినీ విమర్శకులు.
Also Read : Hero Nani – Hit-3 :హిట్ 3పై నమ్మకం విజయం ఖాయం
