Hero Prabhas – Bahubali :జ‌క్క‌న్న బాహుబ‌లి రీ రిలీజ్ 

ప్ర‌క‌టించిన నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ 

Bahubali : భార‌తీయ సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకు వెళ్లిన సినిమా బాహుబ‌లి. షోలే త‌ర్వాత అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. డార్లింగ్ ప్ర‌భాస్, అనుష్క శెట్టి, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ మూవీ రికార్డుల‌ను తిర‌గ రాసింది. బాక్సులు బద్ద‌లు కొట్టింది. కాసుల వ‌ర్షం కురిపించింది. న‌టుడిగా ఓ రేంజ్ కు తీసుకు వెళ్లేలా చేసింది ప్ర‌భాస్ ను. ఇక ద‌ర్శ‌క ధీరుడు జ‌క్క‌న్న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను బాహుబ‌లి(Bahubali) త‌ర్వాత తీసిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ను స్వంతం చేసుకుంది. ఇప్పుడు మ‌హేష్ బాబు తో మ‌రో సినిమా తీసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

Bahubali Movie Re-release Updates

ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కొన‌సాగుతోంది. గ‌తంలో రిలీజ్ అయి హిట్ అయిన మూవీస్ ను తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బాహుబ‌లిని రీ రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. భారతీయ సినిమాల స్థాయిని పెంచిన సినిమాటిక్ మాస్టర్ పీస్ గా గుర్తింపు పొందింది  బాహుబలి.  మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్దం అవుతోంది. . విడుదలైన ఒక దశాబ్దం తర్వాత కూడా ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ఈ మూవీ 10వ వార్షికోత్స‌వం జ‌రుపుకోవ‌డం విశేషం.

ఇక రీ రిలీజ్ సంద‌ర్బంగా బాహుబ‌లిలో  మ‌రికొన్ని సీన్స్ ను జోడిస్తామ‌ని, ప్రేక్ష‌కుల‌కు మ‌ధురానుభూతిని క‌లిగించేలా చేస్తామ‌న్నాడు. అయితే బాహుబ‌లి రెండు పార్ట్ లుగా ఉంది. దీనిని పార్ట్ 1 ను విడుద‌ల చేస్తారా లేక రెండూ క‌లిపి రిలీజ్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు నిర్మాత యార్ల‌గ‌డ్డ‌. తొలి చిత్రం విడుద‌లై 10 ఏళ్లు పూర్తి చేసుకోగా రెండో పార్ట్ రిలీజ్ అయి 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెర‌పై మ‌రోసారి బాహుబ‌లి మ్యాజిక్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు మూవీ మేక‌ర్స్.

Also Read : Beauty Meenakshi Chaudhary :ఆ స‌మ‌స్య వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డ్డా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com