Popular Director Sukumar :పుష్ప రాజ్ పేరు వెనుక పెద్ద క‌థ

ద‌ర్శ‌కుడు సుకుమార్ కామెంట్స్

Sukumar : డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న‌కు బ‌న్నీతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. త‌న‌తో క‌లిసి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీశాడు. పూర్తిగా ల‌వ్ , స‌స్పెన్స్ నేప‌థ్యంగా తీసిన ఆర్య చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత దీనిని సీక్వెల్ ఆర్య‌-2 తీశాడు. ఇందులో పూర్తిగా అల్లు అర్జున్ ను నెగ‌టివ్ రోల్ లో న‌టించేలా చేశాడు. ఇది కూడా బిగ్ హిట్. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ప్ర‌తి మూవీ బిగ్ హిట్ అయ్యేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు సుకుమార్(Sukumar).

Sukumar Comment about Pushparaj Character

కేవ‌లం త‌న కోస‌మే భిన్న‌మైన క్యారెక్ట‌ర్ ను సృష్టించేందుకు ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తానంటూ చెప్పాడు ద‌ర్శ‌కుడు. చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు అంశాల గురించి ప్ర‌స్తావించాడు. త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా వెల్ల‌డించాడు. బన్నీతో ఏ ద‌ర్శ‌కుడు సినిమా తీసినా చాలా కంఫ‌ర్ట్ ఫీల్ అవుతాడ‌ని అన్నాడు. అందుకే త‌న‌తో సినిమా తీయాలంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌న్నాడు సుకుమార్. ఇదే స‌మ‌యంలో తాను బ‌న్నీతో తీసిన పుష్ప‌, పుష్ప -2 సీక్వెల్ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచాయి. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాయి. పుష్ప‌-2 అయితే కంగా దేశంలోనే అత్య‌ధిక వ‌సూలు చేసిన మూవీగా బ్రేక్ చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ అధికారికంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింద‌ని ప్ర‌క‌టించారు.

ఇది ప‌క్క‌న పెడితే పుష్ప రాజ్(Pushparaj) పేరు కావాల‌ని బ‌న్నీకి ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింద‌నే దానిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు సుకుమార్. నిజ జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌నల ఆధారంగా కొన్ని పాత్ర‌ల‌ను ఎంచుకుంటామ‌న్నాడు. అందులో భాగంగా త‌న‌కు త‌ట్టిందే పుష్ప‌రాజ్. పూర్తిగా అడ‌వి, గంధ‌పు చెక్క‌లు, స్మ‌గ్ల‌ర్ పాత్ర ఇవ‌న్నీ కీల‌కం. సినిమాకు బ‌లాన్ని ఇచ్చేలా చేశాయ‌న్నాడు. ప్ర‌తి సినిమాకు ఓ మేన‌రిజం అంటూ ఉంటుంద‌ని, అది ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యేలా చేసింద‌న్నాడు ద‌ర్శ‌కుడు.

Also Read : Hero Chiranjeevi-Vishwambhara :విశ్వంభ‌ర‌లో మెగాస్టార్ స్పెష‌ల్ సాంగ్ 

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com