Sundeep Kishan : ధమాకా తర్వాత దర్శకుడు త్రినాదరావు నక్కిన తన తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ గ్యాప్‌లో నిర్మాతగా మారి నక్కిన కథనం అనే బ్యానర్‌ని స్థాపించారు. కొత్తవాళ్లతో ఛౌర్యపాఠం’ సినిమా తీశారు. తాజా సమాచారం ప్రకారం ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్‌తో త్రినాదరావు ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.
Sundeep Kishan Movie Updates
ఈ సినిమాకి “ఓరినాయనో” అనే టైటిల్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘ధమాకా’లో మాస్‌గా పాడిన బీమ్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడు. శ్యామ్ కె. నాయుడు డిఓపి. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్ మరియు సమాజవరగమన కామెడీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read : Actor Sree Vishnu : నో లాజిక్..ఓన్లీ మ్యాజిక్ అంటూ వస్తున్న ‘ఓం భీమ్ బుష్’ మూవీ
