సినిమా రంగం విచిత్రమైనది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగితే మరోసారి పాత్రలు దొరకక , లభించినా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్క ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఎందరో. టాలీవుడ్ లో అడపా దడపా సునీల్ చేస్తున్నా పూర్తి గా వర్కవుట్ కావడం లేదు.
కానీ మనోడికి తమిళ సినిమా బాగా అచ్చొచ్చినట్లు ఉంది. తాజాగా విశాల్ తో కలిసి చేసిన మార్క్ ఆంటోనీ లో మంచి పేరు వచ్చేలా చేసింది సునీల్ కు. అంతకు ముందు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అక్కడ మార్కులు పడినా ఇప్పుడు ఆంటోనీ తో అదుర్స్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి సునీల్ కు.
తమిళ సినీ రంగానికి చెందిన ఫ్యాన్స్ కూడా మనోడికి బాగా కనెక్టు అయ్యారు. ప్రస్తుతం తాజాగా విడుదలైన మార్క్ ఆంటోనీ తమిళనాడు, కేరళలో బిగ్ టాక్ తెచ్చుకుంది మూవీ. ఇదే సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రిలీజ్ అయిన జైలర్ చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు సునీల్. దీని కంటే ముందు శివ కార్తికేయన్ నటించిన మూవీలో కూడా నటించాడు. మొత్తంగా టాలీవుడ్ కంటే కోలీవుడ్ బాగా వర్కవుట్ అయ్యేలా ఉంది.
