పి. వాసు దర్శకత్వం వహించిన చంద్రముఖి-2 విడుదలైంది. రిలీజైన ప్రతి చోటా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. గతంలో చంద్రముఖి మూవీ సక్సెస్ అయ్యింది. అందులో జ్యోతిక, రజనీకాంత్ నటించారు. ఇందుకు సీక్వెల్ గా ఇదే దర్శకుడు తీశాడు. భారీ ఖర్చు చేశారు.
చంద్రముఖి-2 మూవీకి సంబంధించి నటీ నటులను మార్చారు. మిగతా సినిమాలలో బిజీగా ఉండడంతో రజనీకాంత్ ను తీసుకోలేక పోయామని వెల్లడించారు దర్శకుడు పి. వాసు. తాజాగా విడుదలైన ఈ మూవీలో రజనీ ప్లేస్ లో నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ , జ్యోతిక పాత్రకు బదులు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించింది.
ఈ సినిమాకు సంగీతం అందించారు నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. చంద్రముఖి-2కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్.
విడుదల కంటే ముందే రాఘవ్ లారెన్స్ రజనీకాంత్ ఇంటికి వెళ్లాడు. ఆయన పాదాలను తాకాడు. ఆశీర్వాదం తీసుకున్నాడు. దర్శకుడు పి. వాసుకు లేఖ రాశారు రజనీకాంత్. సినిమా విజయం సాధించాలని కోరారు.
